Saturday, August 8, 2015

అధ్యాత్మరామాయణం - ప్రవచనములు

నాన్నగారి రచనలలో "అధ్యాత్మ రామాయణము" చాలా గొప్ప గ్రంధము.  మొత్తము 2400 పద్యములతో వ్రాయబడినది.  ఇందులో అతి రమణీయమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి.  50 రకాలకి పైగా వృత్తములు ఉన్నాయి.  2 దండకములు ఉన్నాయి. శ్రీ రాముని గూర్చి ఎంతోమంది చేసిన స్తోత్రములు అద్భుతంగా వర్ణించేరు.  భగవద్గీత వంటిదే అయినట్టి శ్రీ రామగీత ఉంది.  ఈ అధ్భుత కావ్యాన్ని అందరికీ అర్ధము అయ్యే విధంగా సరళమైన భాషలో రాసేరు.   ఇంకా వివరించటానికి రోజుకి ఒక అరగంట సేపు ప్రవచనములు చెప్పేరు.   నాన్నగారు శివైక్యం చెందిన ఈరోజుకి స్మృతిగా, ఆ ప్రవచనాలను నేను అందరికీ అందుబాటు అయ్యేటట్లు upload చేసేను.   వీలు అయిన వారు అందరూ ఆ ప్రవచనాలను విని శ్రీ రామచంద్రుని కృపా కటాక్ష పాత్రులు అవుతారు అని ఆశిస్తున్నాను.

ప్రవచనాల కొరకు ఈ URL మీద క్లిక్ చేయండి.  Adhyaatma Raamayana Pravachanam.

-- నేమాని నందకిశోర్



2 comments:

డా. రాంభట్ల వేంకటరాయ శర్మ said...

Namssulu naanna garu pettina bhiksha ga maa tammudu avadhani ga manchi peru techukunnadu. Audio upload cheyadam abhinandaneeyam. Naanna gari avadhana padyalunte upload cheyyagalaru

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ said...

ముందుగా శ్రీ గురువుగారి అబ్బాయి గారికి నమస్సులు. శ్రీ గురువుగారు సార్థక నామధేయులు. ఆయన నిజమైన రామజోగి. నిరంతర రామనామ పారాయణులు. అమ్మగారు నిరంతర “శ్రీమాత్రేనమః” స్మరణతోనే ఉంటారు. శంకరాభరణంలో గురువుగారు రచించిన పద్యాములు, అష్టకములు దండకములు వందలలో ఉన్నవి. శ్రీ కంది శంకరయ్య గారి ద్వారా వాటిని ఈ బ్లాగులో చేర్చిన నాన్న గారు ఆనందింతురని నామనవి. ఈ విషయమై నన్ను ఏమి చేయమనిన చేసెదను. నాన్నగారు అమలాపురం లో ఇచ్చిన ప్రవచనం నావద్ద ఉన్నది. ఎలా పంపాలో తెలియదు. ఈ బ్లాగు ఇప్పుడే చూస్తున్నాను. అన్యథా భావించరాదని మనవి. తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ, మాధవపట్నం, కాకినాడ.