Saturday, August 8, 2015

అధ్యాత్మరామాయణం - ప్రవచనములు

నాన్నగారి రచనలలో "అధ్యాత్మ రామాయణము" చాలా గొప్ప గ్రంధము.  మొత్తము 2400 పద్యములతో వ్రాయబడినది.  ఇందులో అతి రమణీయమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి.  50 రకాలకి పైగా వృత్తములు ఉన్నాయి.  2 దండకములు ఉన్నాయి. శ్రీ రాముని గూర్చి ఎంతోమంది చేసిన స్తోత్రములు అద్భుతంగా వర్ణించేరు.  భగవద్గీత వంటిదే అయినట్టి శ్రీ రామగీత ఉంది.  ఈ అధ్భుత కావ్యాన్ని అందరికీ అర్ధము అయ్యే విధంగా సరళమైన భాషలో రాసేరు.   ఇంకా వివరించటానికి రోజుకి ఒక అరగంట సేపు ప్రవచనములు చెప్పేరు.   నాన్నగారు శివైక్యం చెందిన ఈరోజుకి స్మృతిగా, ఆ ప్రవచనాలను నేను అందరికీ అందుబాటు అయ్యేటట్లు upload చేసేను.   వీలు అయిన వారు అందరూ ఆ ప్రవచనాలను విని శ్రీ రామచంద్రుని కృపా కటాక్ష పాత్రులు అవుతారు అని ఆశిస్తున్నాను.

ప్రవచనాల కొరకు ఈ URL మీద క్లిక్ చేయండి.  Adhyaatma Raamayana Pravachanam.

-- నేమాని నందకిశోర్



Friday, August 7, 2015

ఫండిత నేమాని

                  అందరికీ నమస్కారము.   నా పేరు నేమాని నందకిశోర్.  ఫండిత శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారి రెండవ అబ్బాయిని.  ఈ బ్లాగర్ పేజీని, సుమారు 8 సంవత్సరాల క్రితం మొదలు పెట్టేను.   దీని ముఖ్య ఉద్దేశ్యం మా నాన్నగారి కవిత్వం అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఆలోచన.  అనుకున్నాను కానీ, ఇంతకాలం బ్లాగులు ఏమీ రాయలేదు.  జనన మరణాలు మన చేతిలో ఉండవు.  "జాతస్యహి ధృవో మృత్యుః".  పుట్టిన ప్రతీ ప్రాణికీ మరణము తప్పదు.  నేటికి సరిగ్గా సంవత్సరము క్రితం మా నాన్నగారు శివైక్యం చెందేరు.  నాన్నగారికి అపారమైన సాహిత్య పటిమ, ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్నాయి.  ఆయన 25 అష్టావధానములు, ఎన్నో కవితలు, శతకములు రచించేరు.  భారత దేశంలోనే కాక, అమెరికా, ఇంగ్లాండు దేశాలలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేరు.  ఎవరికైనా తల్లి తండృలు లేని లోటు తీర్చలేనిది.  అలాంటిది ఇంత గొప్ప కవి, ఆత్మ జ్ఞానస్వరూపులు అయినటువంటి మా నాన్నగారు లేని లోటు, ఏనాటికీ తీర్చలేనిది.  మా హృదయ ఆవేదన మాటల్లో చెప్పలేనిది.

             నాన్నగారి రచనలను కొన్నింటిని ఈ బ్లాగులో ఉంచుతాను.   తెలుగు సాహిత్యాభిమానులు, ఆధ్యాత్మిక తత్వ జిజ్ఞాసులు నాన్నగారి రచనలను చదువుతారు అని ఆశిస్తున్నాను.